Deepika Padukone: ఎయిర్ పోర్టులో రాత్రంతా పడిగాపులు కాసిన వీరాభిమాని... ముగ్ధురాలైన దీపిక

  • నేడు దీపిక పదుకొనే జన్మదినం
  • కేక్ కట్ చేయించాలని కోరుకున్న అభిమాని
  • అభిమాని కోరిక తీర్చిన నటి

సినీ తారల పుట్టినరోజులంటే అభిమానులకు పండగే. అభిమాన సంఘాలు కేకులు కట్ చేయడం, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా, తన అభిమాన తారతో కేక్ కట్ చేయించాలని కోరుకున్న ఓ వీరాభిమాని తన కోరిక నెరవేర్చుకున్నాడు. నేడు బాలీవుడ్ అందాలభామ దీపిక పదుకొనే పుట్టినరోజు. ఆమె ఎయిర్ పోర్టుకు వస్తుందని తెలుసుకున్న సదరు అభిమాని కేక్ కొనుగోలు చేశాడు. ఆమె కోసం రాత్రంతా ముంబయి విమానాశ్రయంలోనే గడిపాడు. ఉదయాన్నే భర్త రణవీర్ సింగ్ తో కలిసి లక్నో వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చిన దీపికకు ఈ విషయాన్ని ఫొటోగ్రాఫర్లు చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోయింది. అభిమాని ఆత్మీయతకు అచ్చెరువొందిన అమ్మడు అతడు తీసుకువచ్చిన కేక్ ను కట్ చేసి అతడి ముఖంలో వెలుగులు నింపింది.

Deepika Padukone
Mumbai
Airport
Fan
Birthday
Cake
Bollywood
  • Loading...

More Telugu News