Vizag: ఏ ఎంక్వయిరీకి అయినా నేను రెడీ: మంత్రి బొత్స

  • విశాఖలో నాకు భూములు లేవు
  • నాకే కాదు నా కుటుంబసభ్యుల పేర్లపైనా లేవు
  • ఒకవేళ భూములు ఉంటే దేనికైనా సిద్ధమే

విశాఖపట్టణంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, అక్కడ మంత్రి బొత్స సత్యనారాయణకు భూములు ఉన్నాయని, దీనిపై సీబీఐతో ఎంక్వయిరీ చేయించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై బొత్సను ప్రశ్నించగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఏ ఎంక్వయిరీ అయినా నేను రెడీ’ అని అన్నారు. గతంలో వోక్స్ వ్యాగన్ కుంభకోణంపై తనకు ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేశారని, దీనిపై దర్యాప్తు చేసిన సీబీఐ తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పిందని గుర్తుచేసుకున్నారు. విశాఖపట్టణంలో తన, తన కుటుంబసభ్యుల పేర్ల మీద గానీ భూములు ఏమైనా ఉంటే కనుక దేనికైనా ఒప్పుకుంటానని సవాల్ విసిరారు. అలాగని, తానేమీ పేదవాడిని కాదని, విజయనగరంలో తనకు భూములు ఉన్నాయని చెప్పారు.

Vizag
Minsiter
Botsa Satyanarayana Satyanarayana
Lands
  • Loading...

More Telugu News