Amaravathi: తుళ్లూరులో మహాధర్నా.. భారీ సంఖ్యలో హాజరైన విద్యార్థులు
- మహాధర్నాలో పాల్గొన్న రైతులు, మహిళలు
- రైతులకు మద్దతుగా వస్తున్న వారిని అడ్డుకున్న పోలీస్
- మందడంలో రైతులకు సీపీఎం నేతల సంఘాభావం
రాజధాని అమరావతిని తరలించే యోచనలో ఉన్న ప్రభుత్వం తీరును నిరసిస్తూ రైతుల ధర్నాలు, నిరసనలు కొనసాగుతున్నాయి. తుళ్లూరులో నిర్వహిస్తున్న మహాధర్నాలో రైతులు, మహిళలు, అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. అమరావతి రైతులకు మద్దతుగా వస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. నందిగామ రైతులు, మహిళలను దొనబండ వద్ద అడ్డగించారు. అదేవిధంగా, మందడంలో ఆందోళన చేస్తున్న రైతులకు సీపీఎం నేతలు సంఘీభావం తెలిపారు.
ఇదిలా ఉండగా, రాజమహేంద్రవరంలోని క్వారీ సెంటర్ లో అఖిల పక్షాల ఐకాస ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. మానవహారంలో టీడీపీ, కాంగ్రెస్, జనసేన పార్టీల నేతలతో పాటు ప్రజాసంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు.