Kishan Reddy: కిషన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించిన రాజధాని మహిళలు

  • అమరావతి నుంచి తరలివెళ్లిన మహిళలు, రైతులు
  • కిషన్ రెడ్డిని కలిసి గోడు వెళ్లబోసుకున్న మహిళలు
  • రాజధాని అమరావతిలోనే ఉంటుందన్న కిషన్ రెడ్డి

ఏపీ రాజధాని అమరావతి మహిళలు ఈ మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. అమరావతి నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్లిన మహిళలు, రైతులు సికింద్రాబాద్ లోని కిషన్ రెడ్డి కార్యాలయానికి వెళ్లారు. రాజధానిపై నెలకొన్న పరిణామాలను కిషన్ రెడ్డికి వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా మహిళలు కన్నీళ్లు పెట్టుకోవడంతో కిషన్ రెడ్డి స్పందించారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందని, రాజధాని మార్పు జరగదని హామీ ఇచ్చారు. సీఎం జగన్ ప్రకటనల వల్లే రాజధానిపై ఉద్రిక్తలు ఏర్పడ్డాయని, వైసీపీ ప్రభుత్వం రాజకీయ పక్షాలతో చర్చించాలని అన్నారు. కాగా, ఏపీ రాజధాని మార్పు కోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో గత కొన్ని వారాలుగా అమరావతిలో రైతులు, వారి కుటుంబసభ్యులు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే.

Kishan Reddy
Telangana
Hyderabad
Secunderabad
Andhra Pradesh
Amaravati
Farmers
Women
  • Loading...

More Telugu News