Naga Babu: 'ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వల్ల ఏపీ ప్రజలకు కష్టాలు' అన్న నాగబాబు.. కామెంట్ 'అదిరింది' అంటోన్న నెటిజన్లు

  • ఇద్దరు నేతలను ఉద్దేశించి నాగబాబు ట్వీట్
  • నాగబాబు వ్యాఖ్యకు ఫన్నీగా కామెంట్లు చేస్తోన్న నెటిజన్లు
  • 'మీరేం బాధపడకండి .. మీరు తెలంగాణలో ఉంటున్నారు' అంటూ రిప్లై

'ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు' అంటూ జనసేన నేత, సినీనటుడు నాగబాబు ట్వీట్ చేశారు. ఎవరిని ఉద్దేశించి ఆయన అంటున్నారో స్పష్టంగా తెలపలేదు. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారో గుర్తించిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. అమరావతి రాజధానిపై జరుగుతోన్న గందరగోళంపై స్పందిస్తూ ఆయన ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
 
అయితే, వైసీపీ అభిమాని ఒకరు స్పందిస్తూ... 'వారిలో ఒకరు చంద్రబాబు మరొకరు పవన్ కల్యాణ్.. అంతేగా? నాగబాబు గారూ' అంటూ సెటైర్ వేస్తూ రిప్లై ఇచ్చాడు. 'ఇద్దరు మనుషులే కాదు.. రెండు మాఫియాలు ఉన్నాయి.. వారికి అనైతిక మీడియా మద్దతు తెలుపుతోంది' అని ఒకరు కామెంట్ చేశారు.

నాగబాబు కామెంట్ 'అదిరింది' అంటూ ఒకరు రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఆయన 'అదిరింది' అనే కామెడీ షోలో పాల్గొంటోన్న విషయం తెలిసిందే.

'మీరేం బాధపడకండి సర్.. ఎందుకంటే మీరు తెలంగాణలో ఉంటున్నారు.. మీరు అప్పుడప్పుడు ఏపీలో పర్యటిస్తున్నారంతే!' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

Naga Babu
Jana Sena
  • Loading...

More Telugu News