sanjay raut: ఇదే దేశానికి శివసేన ఇచ్చిన సందేశం: బీజేపీపై శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యలు

  • మహారాష్ట్రలో బీజేపీని ధిక్కరించాం
  • ప్రభుత్వం ఏర్పాటు చేశాం 
  • బీజేపీకి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు 

మహారాష్ట్రలో తాము బీజేపీని ధిక్కరించి ప్రభుత్వం ఏర్పాటు చేశామని శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. బీజేపీకి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని దేశానికి నిరూపించామని అన్నారు. ఇదే దేశానికి తామిచ్చిన సందేశమని చెప్పారు. బీజేపీకి మరింతగా ఓటమి రుచి చూపించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ముస్లింలని భారత్ నుంచి తరిమేయాలని శివసేన వ్యవస్థాపకుడు బాల్‌థాక్రే ఎన్నడూ అనలేదని సంజయ్ రౌత్ అన్నారు. బాల్‌థాక్రేకు చాలామంది ముస్లిం మిత్రులున్నారని తెలిపారు. భారత్‌లో విద్యార్థులపై దాడులు జరిగితే దేశంతో పాటు ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నట్లేనన్నారు. బీజేపీది ‘విభజించు పాలించు’ విధానమని, ఇది ప్రమాదకరమని చెప్పారు.

sanjay raut
shiv sena
BJP
  • Loading...

More Telugu News