Telangana: తెలంగాణ కోసం జగన్ సేవ చేస్తున్నారు.. ఆంధ్ర వాళ్ల కోసం కాదు: సీపీఐ నారాయణ

  • జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారు
  • ఈ ప్రకటనతో హైదరాబాద్ లో స్థిరాస్తి వెంచర్ల రేట్లు పెరిగాయి
  • టీఆర్ఎస్ నేతలు జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు
  • జగన్ మూడేళ్ల సీఎంలా కనపడుతున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు గుప్పించారు. విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి చేస్తోన్న ఆందోళనకు మద్దతు తెలిపిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారని, ఆయన చేసిన  ప్రకటనతో హైదరాబాద్ లో స్థిరాస్తి వెంచర్ల రేట్లు పెరిగాయని అన్నారు.

టీఆర్ఎస్ నేతలు జగన్‌కు ధన్యవాదాలు తెలిపారని నారాయణ అన్నారు. తెలంగాణ కోసం జగన్ సేవ చేస్తున్నారని, ఆంధ్రవాళ్ల కోసం కాదని ఆరోపించారు. జగన్ 30 ఏళ్ల సీఎం కాదని, మూడేళ్ల సీఎంలా కనపడుతున్నారని చురకలంటించారు. కాగా, తాను రాష్ట్రానికి 30 ఏళ్లు సీఎంగా ఉంటానని జగన్ పలుసార్లు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Telangana
Andhra Pradesh
CPI Narayana
  • Loading...

More Telugu News