Charita Reddy: హైదరాబాద్ చేరుకున్న చరితారెడ్డి మృతదేహం!

  • గత నెల 27న మిచిగాన్ లో ప్రమాదం
  • తీవ్ర గాయాలతో మరణించిన చరితారెడ్డి
  • ఇంటికి చేరుకున్న మృతదేహం

గత నెల 27వ తేదీన అమెరికాలోని మిచిగాన్ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందిన చరితారెడ్డి మృతదేహం హైదరాబాద్ చేరుకుంది. ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఫేస్ బుక్ మాధ్యమంగా స్నేహితులు క్రౌడ్ ఫండింగ్ పేజ్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఎంతో మంది దాతలు తమకు తోచినంత డబ్బును అందించగా, ఆ డబ్బుతో విమానంలో చరితా రెడ్డి మృతదేహాన్ని హైదరాబాద్ పంపారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరేడ్ మెట్ లోని రేణుకా నగర్ లో ఉన్న ఆమె నివాసానికి మృతదేహాన్ని తరలించారు. ఈ రోజు సాయంత్రం ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయి. కాగా, రోడ్డు ప్రమాదంలో చరితారెడ్డి బ్రెయిన్ డెడ్ కాగా, ఆమె అవయవాలను 9 మందికి దానం చేశారన్న సంగతి తెలిసిందే. 

Charita Reddy
Michigan
Road Accident
Dead Body
  • Loading...

More Telugu News