YSRCP: చంద్రబాబు కాకి లెక్కలు చెబుతున్నారు: బొత్స

  • ఇంకో రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తే రాజధాని పూర్తవుతుందన్నది అబద్ధం
  • తొలి దశ నిర్మాణాలకే రూ.52,000 కోట్ల పనుల టెండర్లు పిలిచారు  
  • అప్పటి టెండర్ డాక్యుమెంట్లను మీడియాకు చూపిన మంత్రి

రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడి ప్రజలను రెచ్చగొడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాజధాని కోసం చంద్రబాబు ఇప్పటికే రూ.10వేల కోట్లు ఖర్చుపెట్టామని చెబుతున్నారని, ఇంకో మూడువేల కోట్లు ఖర్చుపెడితే రాజధాని నిర్మాణం పూర్తవుతుందంటూ ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నారని బొత్స ధ్వజమెత్తారు. దీనికి సంబంధించి కొన్ని పత్రాలను మీడియాకు మంత్రి చూపెట్టారు.

తొలి దశ నిర్మాణాలకే సుమారు రూ.52,000 కోట్ల పనులకు టెండర్లు పిలిచారన్నారు. దీన్ని బట్టి చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని తెలుస్తోందన్నారు. తాజాగా మూడువేల కోట్లతో రాజధాని పూర్తవుతుందని కాకి లెక్కలు చెబుతున్నారని ధ్వజమెత్తారు.  అప్పట్లో రాజధానిలో ట్రంక్ రోడ్లు నిర్మాణానికి  రూ.19, 769 కోట్లు విలువైన పనులకోసం టెండర్లను పిలిచారన్నారు.  చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలని పేర్కొన్నారు. ఆయన చేసిన తప్పులను సరిదిద్దుతున్నామన్నారు. రైతుల వద్ద తీసుకున్న పొలాల లేఅవుట్లను  అభివృద్ధి చేసేందుకు రూ.17వేల కోట్లు ఖర్చు చేయాలనుకున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News