Botsa Satyanarayana Satyanarayana: శివరామకృష్ణ కమిటీ అమరావతిని వ్యవసాయ క్షేత్రమని పేర్కొంది: బొత్స

  • భవనాల నిర్మాణానికి ఆ ప్రాంతం అనువుకాదని తేల్చింది
  • పరిపాలన వికేంద్రీకరణను కమిటీ సూచించింది
  • అయినా, టీడీపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణం చేపట్టింది

చంద్రబాబు చేసిన తప్పులను జగన్ సరిదిద్దుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ రోజు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను వదిలి వచ్చే హక్కును చంద్రబాబుకు ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు అసహనంగా ఉన్నారంటూ ఆయన ఎప్పుడు ఏది మాట్లాడుతున్నారో తెలియటం లేదన్నారు.

ఉద్యోగులను  ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొల్పుతున్నారన్నారు. శివరామకృష్ణ కమిటీ సూచనల ప్రకారం అమరావతి నిర్మాణం చేపట్టామని చంద్రబాబు చెబుతున్నారని, అయితే ఆ కమిటీ పరిపాలన వికేంద్రీకరణను సూచించిందని బొత్స ఎత్తి చూపారు. అమరావతి ప్రాంతం వ్యవసాయ క్షేత్రమని, ఇక్కడ భవనాలు కట్టడం న్యాయం కాదని ఆ కమిటీ చెప్పిందన్నారు. అది మరచి చంద్రబాబు అక్కడ రాజధాని నిర్మాణానికి పూనుకున్నారని ధ్వజమెత్తారు. తాజాగా అమరావతి రైతుల వద్దకు వచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.

Botsa Satyanarayana Satyanarayana
YCP
Amaravati
  • Loading...

More Telugu News