Andhra Pradesh: ఏపీ ఏసీబీ డీజీ బదిలీ.. నూతన డీజీగా సీతారామాంజనేయులు!

  • ప్రస్తుతం రవాణా శాఖ కమిషనర్ గా ఉన్న సీతారామాంజనేయులు 
  • ఏపీ పీఎస్సీ కార్యదర్శిగానూ ఆయనకు అదనపు బాధ్యతలు
  • రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబుకూ అదనపు బాధ్యతలు

ఏపీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీ కుమార్ విశ్వజిత్ ను బదిలీ చేశారు. డీజీపీ కార్యాలయానికి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. రవాణా శాఖ కమిషనర్ గా ఉన్న పి.సీతారామాంజనేయులును ఏసీబీ డీజీగా బదిలీ చేశారు. ఏపీపీఎస్సీ కార్యదర్శిగానూ సీతారామాంజనేయులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం రవాణా, రహదారులు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న ఎం.టి.కృష్ణబాబుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. రవాణాశాఖ కమిషనర్ గా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Andhra Pradesh
ACB
DG
kumar viswajit
  • Loading...

More Telugu News