JC Diwakar Reddy: జేసీని పరామర్శించేందుకు వచ్చిన పార్థసారథిని అడ్డుకున్న పోలీసులు

  • పోలీసులకు లొంగిపోయిన జేసీ
  • ఆరు గంటలకు పైగా జేసీని పీఎస్ లోనే ఉంచిన పోలీసులు
  • పోలీసులకు వ్యతిరేకంగా కార్యకర్తల నినాదాలు

పోలీసులతో బూట్లు నాకిస్తానంటూ వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం గ్రామీణ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన సంగతి తెలిసిందే. ముందస్తు బెయిల్ తో పీఎస్ కు వచ్చిన ఆయనను పోలీసులు ఆరు గంటలకుపైగా స్టేషన్ లోనే ఉంచారు. అంతేకాదు, పీఎస్ ఆవరణలో మీడియా ఉండకూడదంటూ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, స్టేషన్ లో ఉన్న జేసీ దివాకర్ రెడ్డిని పరామర్శించేందుకు టీడీపీ నేత బీకే పార్థసారథి వచ్చారు. అయితే పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. జేసీని కలిసేందుకు అనుమతించలేదు. పోలీస్ స్టేషన్ మెయిన్ గేటు వద్దే ఆయన్ను నిలువరించడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

JC Diwakar Reddy
Andhra Pradesh
Anantapur District
Police
Parthasaradhi
  • Loading...

More Telugu News