Telangana: ఎన్నికలకు కాంగ్రెస్ భయపడదు: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • విపక్షాలను ఇబ్బంది పెట్టడానికి టీఆర్ఎస్ కుట్రపన్నుతోంది
  • ఈసీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోంది
  • సీఏఏపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయాలి

ఎన్నికలకు కాంగ్రెస్ ఎప్పుడూ భయపడదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. విపక్షాలను ఇబ్బంది పెట్టడానికి టీఆర్ఎస్ కుట్రపన్నుతోందని విమర్శించారు. ఈ రోజు ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలను గుప్పించారు. రిజర్వేషన్ల విషయం తేల్చక ముందే మునిసిపాలిటీ ఎన్నికలకు సమాయత్తమయిందని విమర్శించారు. ఈసీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సీఏఏపై సీఎం కేసీఆర్ తన వైఖరిని వెల్లడించడం లేదెందుకని ప్రశ్నించారు. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.

Telangana
TPCC dhief
Uttam Kumar Reddy
municipal Elections
  • Loading...

More Telugu News