Yadadri Bhuvanagiri District: యాదాద్రి భువనగిరిలో కాంగ్రెస్ సమావేశం రసాభాస!

  • భువనగిరిలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం
  • జనగామ, యాదాద్రి కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ
  • ఎంపీ కోమటిరెడ్డి, పార్టీ కోశాధికారి నారాయణరెడ్డి  ముందే ఘర్షణ

తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం ఈరోజు నిర్వహించారు.
 
జనగామ, యాదాద్రి జిల్లాల నేతల మధ్య అంతర్గత విభేదాలు బయటపడటంతో ఇరువర్గాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. దీంతో, సమావేశం నుంచి జనగామ జిల్లా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బయటకు వెళ్లిపోయారు. ఈ తతంగం అంతా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పార్టీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ముందే జరిగింది.

Yadadri Bhuvanagiri District
congress
Mp
Komati
  • Loading...

More Telugu News