Andhra Pradesh: బీసీజీ కమిటీ ఎప్పుడు వేశారు?... మూడు రోజుల్లో నివేదిక ఇస్తారా?: సుజనా చౌదరి

  • ఏపీ ప్రభుత్వానికి బీసీజీ నివేదిక సమర్పణ
  • బీసీజీ నివేదిక హాస్యాస్పదంగా ఉందన్న సుజనా
  • రాజధానిని కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉందని వ్యాఖ్యలు

రాష్ట్ర ప్రభుత్వానికి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) కమిటీ నివేదిక సమర్పించడంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. బీసీజీ కమిటీ నివేదిక హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు, ఈ బీసీజీ కమిటీని ఎప్పుడు వేశారు?... అయినా మూడు రోజుల్లోనే నివేదిక రూపొందించగలరా? అంటూ సుజనా విస్మయం వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏపీలో ఆర్థిక అత్యయిక పరిస్థితి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు. రాజధానిని కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉందని, 13 జిల్లాల ప్రజలు రాజధాని అమరావతిని కాపాడుకోవాలని సూచించారు.

Andhra Pradesh
Amaravati
Vizag
AP Capital
BCG Committee
Sujana Chowdary
BJP
  • Loading...

More Telugu News