Andhra Pradesh: అసెంబ్లీలో సీఎం చెప్పిందే జీఎన్ రావు, బీసీజీ నివేదికల్లో ఉంది: సోమిరెడ్డి

  • నెల్లూరులో టీడీపీ నేతల సమావేశం
  • రాజధాని అంశంపై స్పందించిన సోమిరెడ్డి
  • కేంద్రం చూస్తూ ఊరుకోదని వ్యాఖ్యలు

నెల్లూరులో టీడీపీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఏపీ అసెంబ్లీలో సీఎం చెప్పిన విషయాలే జీఎన్ రావు, బీసీజీ కమిటీ నివేదికల్లో ఉన్నాయని విమర్శించారు. ప్రధాని శంకుస్థాపన చేసి నిధులు కూడా ఇచ్చాక, ఇప్పుడు రాజధాని మార్చుతుంటే కేంద్రం చూస్తూ ఊరుకోదని అన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను బాధపెట్టడం సరికాదని సోమిరెడ్డి హితవు పలికారు. వైసీపీ ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు.

Andhra Pradesh
Amaravati
AP Capital
Telugudesam
Nellore District
Somireddy
Jagan
YSRCP
GN Rao Committee
BCG Committee
  • Loading...

More Telugu News