Yamini Sharma: బీజేపీ తీర్థం పుచ్చుకున్న సాదినేని యామిని శర్మ

  • కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమక్షంలో చేరిక
  • పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన షెకావత్
  • గత  నవంబర్ లో టీడీపీని వీడిన యామిని

టీడీపీ మాజీ నేత సాదినేని యామిని శర్మ ఈ రోజు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. కడప జిల్లాలో పర్యటిస్తున్న షెకావత్ ఓ కార్యక్రమంలో యామిని శర్మకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత ఏడాది నవంబర్ లో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి, పార్టీ ఫ్రాథమిక సభ్యత్వానికి యామిని శర్మ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

వ్యక్తిగతమైన కారణాలతో పాటు రాష్ట్రం, దేశంలోని రాజకీయ పరిస్థితుల మూలంగా పార్టీని వీడుతున్నట్లు ఆమె ప్రకటించారు. చంద్రబాబు తనకు ఇచ్చిన సహకారం ఎనలేనిదని టీడీపీని వీడుతున్న సమయంలో ఆమె పేర్కొన్నారు.

Yamini Sharma
BJP
Joined
welcomed
by union minister
Gajendra Singh Shekhawat
  • Loading...

More Telugu News