Andhra Pradesh: నాడు అమరావతికి మద్దతుగా జగన్ ఏమన్నారో చూడండి: జనసేన శతఘ్ని

  • 2014లో అమరావతికి మద్దతుగా జగన్ వ్యాఖ్యలు
  • నాడు జగన్ వ్యాఖ్యలను ట్వీట్ చేసిన వైసీపీ
  • ఇప్పుడదే ట్వీట్ ను తెరపైకి తీసుకువచ్చిన జనసేన శతఘ్ని

ఏపీలో ఇప్పుడు మూడు రాజధానుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జీఎన్ రావు కమిటీ నివేదికతో పాటు బీసీజీ నివేదిక కూడా రావడంతో హైపవర్ కమిటీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో అమరావతికి మద్దతుగా జగన్ చేసిన వ్యాఖ్యలను జనసేన సోషల్ మీడియా విభాగం శతఘ్ని బయటపెట్టింది.

ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ఉద్దేశం తమకు లేదని, అందుకే విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటుకు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు జగన్ చేసిన వ్యాఖ్యలను 2014 సెప్టెంబరు 4న వైసీపీ ట్వీట్ చేసింది. ఇప్పుడా ట్వీట్ ను జనసేన శతఘ్ని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. జగన్ రెడ్డి నాడు ఏమన్నాడో చూడండి అంటూ పోస్టు చేసిన ఈ ట్వీట్ కు భారీగా లైకులు, రీట్వీట్లు వస్తున్నాయి.

Andhra Pradesh
Amaravati
AP Capital
YSRCP
Jagan
Jana Sena
Shataghni
Twitter
  • Error fetching data: Network response was not ok

More Telugu News