Karem Sivaji: ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకించే పార్టీలన్నీ దళిత వ్యతిరేక పార్టీలు: కారెం శివాజీ
- అవసరమైతే ఉద్యమం చేపడతామని వెల్లడి
- విశాఖలో మీడియాతో మాట్లాడిన కారెం శివాజీ
- మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూ వ్యాఖ్యలు
వైసీపీ నేత కారెం శివాజీ ఏపీలో ఆంగ్ల మాధ్యమం అంశంపై స్పందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం కోసం అవసరమైతే రాష్ట్రంలో ఉద్యమం చేపడతామని ప్రకటించారు. ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలను దళిత వ్యతిరేక పార్టీలుగానే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాజధాని అంశంపైనా స్పందించారు. అమరావతిలో కిలోమీటరు రోడ్డు వేయాలంటే రూ.10 లక్షలు ఖర్చయితే, విశాఖలో కేవలం రూ.20 లక్షల ఖర్చుతో 10 కిలోమీటర్ల రోడ్డు వేయొచ్చని తెలిపారు. ఏపీలో మూడు రాజధానుల అంశాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.