Jagan: ఆ పని చేస్తే జగన్ కు పాదాభివందనం చేస్తా: జలీల్ ఖాన్

  • అమరావతిలోనే రాజధాని ఉండాలి
  • రాజధానిని మార్చకుండా ఉంటే జగన్ కు పాదాభివందనం చేస్తా
  • జగన్ ను చూసి ఉద్యోగులు భయపడుతున్నారు

రాజధాని అమరావతిలోనే ఉండాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పాలన మొత్తం ఒక చోట నుంచే సాగాలని అన్నారు. మూడు రాజధానుల నిర్ణయం సరికాదని చెప్పారు. అమరావతి ప్రాంత రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తోందని అన్నారు. రాజధానిని మార్చకుండా ఉంటే ముఖ్యమంత్రి జగన్ కు పాదాభివందనం చేస్తానని చెప్పారు. జగన్ ను చూసి ఉద్యోగులు భయపడుతున్నారని... అందుకే మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారని అన్నారు. జగన్ తన పతనానికి తానే నాంది పలుకుతున్నారని చెప్పారు.

Jagan
Jaleel Khan
Telugudesam
YSRCP
Amaravati
  • Loading...

More Telugu News