Tenali: తెనాలిలో రాజధాని పరిరక్షణ ఐకాస ఆధ్వర్యంలో ధర్నా

  • రాజధాని అమరావతిని తరలించవద్దంటూ నిరసనలు
  • ఆందోళనలో పాల్గొన్న టీడీపీ నేతలు, నాయకులు
  • రాజధాని గ్రామాల్లో కొనసాగుతున్న స్వచ్ఛంద బంద్  

రాజధాని పరిరక్షణ ఐకాస ఆధ్వర్యంలో ఆరో రోజు నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రాజధాని అమరావతిని తరలించవద్దంటూ తెనాలిలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో టీడీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమరావతికి మద్దతుగా విద్యార్థి సంఘాలు సంఘీభావ యాత్ర నిర్వహించాయి. స్థానిక చెంచుపేట నుంచి విద్యార్థులతో కలిసి టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ భారీ ప్రదర్శన నిర్వహించారు.

కాగా, ర్యాలీలో పాల్గొనేందుకు విద్యార్థులను పంపొద్దంటూ కళాశాలల యాజమాన్యాలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉండగా, మహిళలు, రైతులపై జరిగిన దాడికి నిరసనగా రాజధాని గ్రామాల్లో స్వచ్ఛంద బంద్ కొనసాగుతోంది. తుళ్లూరులో వాణిజ్య సంస్థలు, బ్యాంకులు, పాఠశాలలు మూసివేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News