Yanamala: యనమలపై ఎమ్మెల్యే రోజా ఆసక్తికర ట్వీట్

  • 'విశాఖలో రాజధాని కావాలని ఎవరు అడిగారు?' అని యనమల అన్నారు
  • 'పుచ్చిపోయిన పన్నుకి సింగపూర్ వెళ్లమని ఎవరు చెప్పారు?'
  • ఈ ప్రశ్న ప్రజలు వేస్తున్నారు  

విశాఖలో రాజధాని కావాలని ఎవరు అడిగారని, విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరమని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆయనపై సెటైర్లు వేశారు.

'విశాఖలో రాజధాని కావాలని ఎవరు అడిగారు?' అని యనమల అన్నారని.. 'పుచ్చిపోయిన పన్నుకి సింగపూర్ వెళ్లమని ఎవరు చెప్పారు?'  అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని రోజా ట్వీట్ చేశారు. కాగా, ఆమె ట్వీట్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. 'అంటే, అప్పుడు వాళ్లు దోచుకున్నారు, ఇప్పుడు మీరు దోచుకుంటున్నారు అని ప్రజలు అంటున్నారు.. అంతేనా మేడం??' అని ఒకరు కామెంట్ చేశారు.  

Yanamala
roja
Andhra Pradesh
  • Loading...

More Telugu News