Galla Jaydev: వేలాది పోలీసులను దించారు.. రైతులపై, మహిళలపై దాడులు హేయం: గల్లా జయదేవ్

  • మహిళల ఆందోళనలపై గల్లా జయదేవ్ స్పందన
  • శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మహిళలను అరెస్టు చేశారు
  • ఈ ఆందోళనను అణచివేయగలమని అనుకోవడం వారి అవివేకం 

అమరావతి నుంచి రాజధానిని తరలించొద్దని మందడంలో ఆందోళన చేస్తోన్న కొందరు మహిళా రైతులను పోలీసులు అరెస్టు చేసి, అక్కడి నుంచి తరలించబోగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై పలు దినపత్రికల్లో వచ్చిన వార్తలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఏపీ ప్రభుత్వంపై  విమర్శలు గుప్పించారు.

'అమరావతిని రాజధానిగా కొనసాగించాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మహిళలను అప్రజాస్వామికంగా అరెస్టు చేసిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రం కోసం భూములు త్యాగం చేసిన రైతులపై, మహిళలపై పోలీసుల దాడులు హేయనీయం. వేలాది పోలీసులను దించి ఈ ఆందోళనను అణచివేయగలమని అనుకోవడం వారి అవివేకం' అని గల్లా జయదేవ్ ట్వీట్ చేశారు.

Galla Jaydev
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News