Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై గుడివాడ అమర్ నాథ్ సెటైర్లు

  • హైదరాబాదుకు వెళ్లిన వెంటనే పవన్ మాట మార్చారు
  • చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు
  • అశోక్ రాజులా కాకుండా బంటులా వ్యవహరిస్తున్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ విమర్శలు గుప్పించారు. అమరావతిలో పర్యటించిన సందర్భంగా రైతుల పక్షాన ఉంటానని డబ్బాడు పెరుగన్నం తిన్నారని... ఆ అన్నం అరగక ముందే హైదరాబాదుకు వెళ్లి మాట మార్చారని అన్నారు. టీడీపీ అధినేత ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారని... అద్భుతమైన రాజధానిని నిర్మిస్తే... ఆయన కుమారుడు లోకేశ్ ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. విశాఖలో పులివెందుల పంచాయితీ అని చంద్రబాబు వ్యాఖ్యానిస్తున్నారని... విశాఖ అన్ని ప్రాంతాల ప్రజల నివాస వేదిక అని అన్నారు.

విశాఖను రాజధానిగా విమర్శించే టీడీపీ నాయకులంతా ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారని అమర్నాథ్ చెప్పారు. చంద్రబాబు మాటలు విని అశోక్ గజపతిరాజు, కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. అశోక్ గజపతిరాజు ఒక రాజులా కాకుండా ఒక బంటుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

Pawan Kalyan
Chandrababu
Kinjarapu Acchamnaidu
Ashok Gajapathi Raju
Gudivada Amarnath
Telugudesam
Janasena
YSRCP
  • Loading...

More Telugu News