Jagan: జగన్ రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి: సీపీఐ నారాయణ డిమాండ్

  • రాజధాని అమరావతిలోనే కొనసాగేలా ప్రత్యక్ష పోరాటం చేస్తాం
  • అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిని జగన్ అప్పట్లో ఆమోదించారు
  • అధికారంలోకి వచ్చాక మాత్రం మూడు రాజధానులు అంటున్నారు

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ప్రతిపాదనలపై సీపీఐ నేత నారాయణ విమర్శలు గుప్పించారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజధానిని అమరావతి నుంచి మార్చాలనుకుంటే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు సూచించారు. రాజధాని అమరావతిలోనే కొనసాగేలా తాము ప్రత్యక్ష పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

కులాలు, మతాల వారీగా జగన్ ఏపీలో  ఉప ముఖ్యమంత్రులను నియమించారని నారాయణ విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిని జగన్ అప్పట్లో ఆమోదించారని చెప్పారు. అధికారంలోకి వచ్చాక మాత్రం మూడు రాజధానులు అంటున్నారని విమర్శించారు.   పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన వైసీపీ నేతలు ఇక్కడ మాత్రం సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకమని అంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 

Jagan
Amaravati
Andhra Pradesh
YSRCP
CPI Narayana
  • Loading...

More Telugu News