Jagan: ముఖ్యమంత్రి గారూ.. వారిలో ఆవేశం కట్టలు తెంచుకుంది: వర్ల రామయ్య

  • అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు
  • ఉద్యమాలను ఆపడం ఎవరి తరం కాదు
  • మహిళలపై ప్రభుత్వం పాశవికంగా దాడి చేసింది

రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దంటూ ఆ ప్రాంతంలోని రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అమరావతి ప్రజలకు టీడీపీ, జనసేన మద్దతు పలుకుతున్నాయి.

ఈ నేపథ్యంలో టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, 'ముఖ్యమంత్రి గారూ... అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎవరూ ఆపలేరు' అని అన్నారు. పోలీసులను ఉపయోగించి ఉద్యమాలను ఆపడం ఎవరి తరం కాదని చెప్పారు. మహిళా ఉద్యమకారులపై ప్రభుత్వం పాశవికంగా దాడి చేసిందని మండిపడ్డారు.

ఉద్యమకారులను రెచ్చగొట్టారని... వారిలో ఆవేశం కట్టలు తెంచుకుందని అన్నారు. మహిళా శక్తిని ఆపలేరని చెప్పారు. అమరావతి తరలింపును ఆపాలని సూచించారు. చరిత్ర హీనులుగా మిగిలిపోవద్దని అన్నారు.

Jagan
Varla Ramaiah
Telugudesam
YSRCP
Amaravati
  • Loading...

More Telugu News