Crime News: సిగరెట్ల గోదాములో చోరీ...రూ.60 లక్షల పేకెట్ల అపహరణ!

  • హైదరాబాద్ శివారు చందానగర్‌లో ఘటన 
  • వ్యాన్ పై వచ్చిన నలుగురు ముసుగు వీరులు 
  • విలువైన సిగరెట్లు ఎత్తుకెళ్లిన వైనం

'అగ్నిదేవుడిని ఆవాహనం చేస్తూ.... ఊపిరితిత్తుల్లోకి వాయువు పంపి... శ్వేతవర్ణ మేఘాల ఆకాశాన్ని సృష్టిస్తూ... పన్నీటి సుగంధాలు వెదజల్లే సిగరెట్టు వెలకట్టలేనిది' అంటూ ఓ భావుకుడు ఆస్వాదనకు లోనవుతాడు. 'డబ్బు, బంగారంలో ఏముంది...మనసుకు హాయి, మెదడుకు మత్తు ఇచ్చే సిగరెట్లు ఉండగా' అనుకున్నారు ఈ చోర శిఖామణులు కూడా. ఏకంగా సిగరెట్ల గోదాములోకి ప్రవేశించి విలువైన సిగరెట్లు ఎత్తుకుపోయారు. చోరీ సొత్తు విలువ రూ.60 లక్షలని పోలీసులు తేల్చారు.

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ చందానగర్ లోని శ్రీదేవి థియేటర్ రోడ్డు పద్మజ కాలనీలో ఐదంతస్తుల భవనం ఉంది. ఒకటి నుంచి మూడు అంతస్తుల్లో ఓ పాఠశాల నడుస్తుండగా, గ్రౌండ్ ఫ్లోర్ లో సిగరెట్ల హోల్ సేల్ వ్యాపారం నడుస్తోంది. వీరి సిగరెట్ల గోదాము ఇదే భనంలోని నాలుగో అంతస్తులో ఉంది.

నిన్న ఎప్పటిలాగే విధుల్లోకి వచ్చిన సిబ్బంది తాళాలు పగులగొట్టి ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించగా ముందురోజు రాత్రి నలుగురు వ్యక్తులు ముసుగులతో వ్యాన్లో వచ్చారు. మెట్ల మార్గంలో పై అంతస్తుకు వెళ్లారు. గడ్డపారతో ఇనుపజాలీ తొలగించి గోదాము లోపలికి ప్రవేశించారు.

సీసీ కెమెరాల వైర్లు కట్ చేశారు. గోదాములో దాదాపు రూ.6 కోట్ల విలువైన సరుకు ఉండగా అందులో 60 కార్టన్లను ఎత్తుకెళ్లారు. ఒక కార్టన్ అంటే పది ప్యాకెట్లు లేక 200 సిగరెట్లు ఉంటాయి. కొన్ని కార్టన్లలో 20 ప్యాకెట్లు, మొత్తం 400 సిగరెట్లు ఉంటాయి. చోరీ సొత్తు విలువ అరవై లక్షల వరకు ఉంటుందని అంచనా.

  • Loading...

More Telugu News