Jagan: జగన్, మంత్రుల చర్యలు కమిటీల విశ్వసనీయతను దెబ్బతీశాయి: ఐవైఆర్ కృష్ణారావు

  • జీఎన్ రావు కమిటీలోని అంశాలను జగన్ ముందే ప్రస్తావించారు
  • బీసీజీ నివేదికలోని విషయాలను మంత్రులు ముందే ప్రస్తావించారు
  • కోర్టుల్లో ఇవి ఇబ్బందికర పరిణామాలను కలగజేయవచ్చు

ఏపీ రాజధానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్ రావు, బీసీజీ కమిటీల నివేదికలపై ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీఎన్ రావు కమిటీలో ఉన్న అంశాలను అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ ముందే ప్రస్తావించారని తెలిపారు.

బీసీజీ నివేదిక విషయానికి వస్తే... ఇందులోని అంశాలను మంత్రులు ముందే ప్రస్తావించారని చెప్పారు. ఈ నివేదికల ఆధారంగానే చర్యలు తీసుకోవాలని... కానీ, సీఎం, మంత్రుల చర్యలు కమిటీల విశ్వసనీయతను దెబ్బతీశాయని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో కోర్టుల్లో ఇవి ఇబ్బందికర పరిణామాలను కలగజేయవచ్చని తెలిపారు.

Jagan
IYR Krishna Rao
GN Rao Committee
BCG Committee
Amaravati
  • Loading...

More Telugu News