BCG Committee: బీసీజీ నివేదికపై త్వరలోనే హైపవర్ కమిటీ సమావేశం: మంత్రి ఆదిమూలపు సురేశ్

  • నివేదిక సమర్పించిన బీసీజీ
  • స్పందించిన మంత్రి ఆదిమూలపు
  • రెండు నివేదికలను ప్రజల ముందుంచుతామని వెల్లడి

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదిక రానే వచ్చింది. దీనిలోని అంశాలపై చర్చించేందుకు త్వరలోనే హైపవర్ కమిటీ సమావేశమవుతుందని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఈ నివేదికలను కమిటీ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుందని చెప్పారు.

అభివృద్ధి వికేంద్రీకరణ దిశగానే తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని అన్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికతో పాటు, బీసీజీ నివేదికను కూడా ప్రజల ముందుకు తీసుకెళతామని మంత్రి పేర్కొన్నారు. అసెంబ్లీలోనూ దీనిపై చర్చించిన తర్వాత సీఎం జగన్ నిర్ణయం ఉంటుందని వివరించారు. రాజధానిపై నియమించిన హైపవర్ కమిటీలో మంత్రి ఆదిమూలపు సురేశ్ కూడా ఓ సభ్యుడు.

BCG Committee
Report
Andhra Pradesh
YSRCP
Jagan
Adimulapu
GN Rao Committee
  • Loading...

More Telugu News