K.Viswanath: కె.విశ్వనాథ్ దంపతులకు జయప్రద ఆత్మీయ సత్కారం

  • కళాతపస్వి నివాసానికి వెళ్లిన జయప్రద
  • జయప్రద వెంట సోదరి సౌందర్య
  • నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన జయప్రద

పలు చిత్రాల్లో నటించడం ద్వారా తనలోని ప్రతిభను చాటుకున్న నటి జయప్రద. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో ఆమె నటించిన సిరిసిరిమువ్వ, సాగరసంగమం చిత్రాలు జయప్రద కెరీర్ లోనే ఆణిముత్యాలుగా పేర్కొనవచ్చు. జయప్రదలోని నటికి కె.విశ్వనాథ్ మరింత మెరుగులు దిద్దారు. ఇప్పుడా గురుభావంతోనే జయప్రద కళాతపస్వి నివాసానికి విచ్చేశారు. తన సోదరి సౌందర్యతో కలిసి హైదరాబాద్ లోని కె.విశ్వనాథ్ నివాసానికి వచ్చిన జయప్రద ఆయను, ఆయన అర్ధాంగిని సత్కరించారు. పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

K.Viswanath
Jayaprada
Tollywood
New Year
Sirisiri Muvva
Sagara Sangamam
  • Loading...

More Telugu News