Ascor Awards: ఆస్కార్ నామినేషన్ బరిలో.. నీనా గుప్తా నటించిన ‘ది లాస్ట్ కలర్’ చిత్రం

  • బెస్ట్ ఫిల్మ్ కేటగిరిలో నామినేట్ అయిన భారతీయ చిత్రం
  • ఈ కేటగిరిలో పోటీపడుతున్న 344 చిత్రాలు
  • తొలి దర్శకత్వంతోనే అస్కార్ పోటీలో దర్శకుడు వికాస్ ఖన్నా

త్వరలో ప్రకటించనున్న 92వ ఆస్కార్ అవార్డులకు బాలీవుడ్ సీనియర్ నటి నీనాగుప్తా నటించిన ‘ది లాస్ట్ కలర్’ చిత్రం ఉత్తమ చిత్రం విభాగంలో నామినేషన్ కోసం ఎంపికైంది. ఈ చిత్రం 344 చిత్రాలతో పోటీ పడనుంది. ఈ జాబితానుంచి ఫైనల్ గా ఐదు చిత్రాలను అవార్డులకోసం ఎంపిక చేస్తారు. అనంతరం అవార్డుల ప్రదాన కార్యక్రమంలో అవార్డు గెలుచుకున్న చిత్రాన్ని ప్రకటిస్తారు. ది లాస్ట్ కలర్  చిత్రానికి ప్రముఖ ఇండో అమెరికన్ చెఫ్ దర్శకత్వం వహించారు. జాతీయ అవార్డు గ్రహీత నీనా గుప్తా నటించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు వికాస్ ఖన్నా దర్శకత్వం వహించారు.

ఉత్తమ చిత్రం నామినేషన్ విభాగంలో తమ చిత్రం ఉందని తెలుసుకున్న వికాస్ ఖన్నా, నటి నీనా గుప్తాలు తమ సంతోషాన్ని పట్టలేకపోయారు. వీరిద్దరూ ట్విట్టర్లో తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘2020 ఏడాదిని అద్భుతంగా ప్రారంభించాం. విశ్వ జగత్తుకు ధన్యవాదాలు. మా హృదయం పెట్టి తీసిన ది లాస్ట్ కలర్ స్వచ్ఛమైన మనసులను తాకుతుంది. 2019 ఉత్తమ చిత్రంకోసం 344 సినిమాలు అర్హత పొందాయని అస్కార్ అకాడమీ ప్రకటించింది’ అని ట్వీట్ చేశారు. అస్కార్ అవార్డులను విజేతలకు ఈ ఏడాది ఫిబ్రవరి 9న హాలీవుడ్ లోని డోల్బి థియేటర్లో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు.

Ascor Awards
Neena gupta
The last color
Movie
best picture catagory
nomination
  • Loading...

More Telugu News