Devineni Uma: ఉత్తర్వులపై సంతకాలు చేసేముందు అధికారులు ఐఏఎస్ శ్రీలక్ష్మి ఫొటో ముందుంచుకోవాలి: దేవినేని ఉమ

  • రాజధాని అంశంపై టీడీపీ ప్రెస్ మీట్
  • రహస్య జీవోలు ఇస్తున్నారని దేవినేని ఉమ ఆరోపణలు
  • రాజధానిని తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వెల్లడి

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రాజధాని అంశంపై స్పందించారు. సీఎం జగన్ రాజధానిని విశాఖకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారని, అందుకోసం రహస్యంగా జీవోలు ఇస్తున్నారని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో, ఉత్తర్వులపై సంతకాలు చేసేముందు అధికారులు ఒక్కసారి సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి పరిస్థితిని గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. అధికారులు శ్రీలక్ష్మి ఫొటోను ముందుంచుకోవాలని సూచించారు. జగన్ చేసే అక్రమాలకు ఇప్పుడు సహకరిస్తే, భవిష్యత్తులో సీబీఐ విచారణ ఎదుర్కోక తప్పదని ఉమ స్పష్టం చేశారు.

Devineni Uma
Telugudesam
Andhra Pradesh
Amaravati
Vizag
IAS Srilakshmi
YSRCP
  • Loading...

More Telugu News