Andhra Pradesh: పాక్ చెరలో ఉన్న ఏపీ మత్స్యకారులు విడుదలవుతున్నారంటే అది వైసీపీ ఎంపీల పోరాట ఫలితమే: విజయసాయిరెడ్డి

  • పాక్ జైళ్లలో మగ్గుతున్న 20 మంది తెలుగు మత్స్యకారులు
  • జనవరి 6న విడుదల
  • వాఘా సరిహద్దు ప్రాంతంలో అప్పగింతకు ఏర్పాట్లు

పాకిస్థాన్ చెరలో మగ్గిపోతున్న ఏపీ మత్స్యకారులు విడుదలవుతున్నారన్న వార్త ఎంతో సంతోషం కలిగిస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 20 మంది తెలుగు మత్స్యకారులను పాక్ అధికారులు జనవరి 6న వాఘా బోర్డర్ వద్ద భారత్ కు అప్పగిస్తున్నారని వెల్లడించారు. ఏపీ మత్స్యకారులు మళ్లీ దేశంలో అడుగుపెడుతున్నారంటూ, అందుకు కారణం వైసీపీ ఎంపీల అవిశ్రాంత పోరాటమేనని విజయసాయి స్పష్టం చేశారు. ఈ విషయంలో విదేశాంగ మంత్రి జయశంకర్ దౌత్యపరమైన మద్దతు, సహకారం మరువలేమని తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

Andhra Pradesh
Pakistan
Fishermen
Wagha
Border
Vijay Sai Reddy
  • Loading...

More Telugu News