Narendra Modi: మీరేమైనా భారత్ లో పాకిస్థాన్ రాయబారా?: మోదీపై మమతా విసుర్లు

  • పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు
  • సిలిగురిలో ర్యాలీ
  • హాజరైన మమతా బెనర్జీ

ప్రధాని నరేంద్ర మోదీపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శనాస్త్రాలు సంధించారు. దేశంలోని ప్రతి సమస్యలోకి పాకిస్థాన్ ను ఎందుకు లాగుతున్నారంటూ ప్రశ్నించారు. మీరు భారత్ కు ప్రధానా? లేక, భారత్ లో పాకిస్థాన్ రాయబారా? అని నిలదీశారు. మహోన్నత సంస్కృతి, గొప్ప వారసత్వ సంపదకు నెలవైన భారత్ ను పాకిస్థాన్ తో పోల్చడం సరికాదని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ సిలిగురిలో ఏర్పాటు చేసిన సభలో మమత ఈ వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా దేశ ప్రజలు ఇప్పటికీ తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి రావడం సిగ్గుపడాల్సిన విషయం అన్నారు.

Narendra Modi
BJP
NRC
CAA
NPR
West Bengal
Mamatha Banarjee
  • Loading...

More Telugu News