Vijay Devarakonda: ఫీల్ ద లవ్... 'వరల్డ్ ఫేమస్ లవర్' టీజర్ వచ్చేసింది!

  • విజయ్ దేవరకొండ హీరోగా వరల్డ్ ఫేమస్ లవర్
  • క్రాంతిమాధవ్ దర్శకత్వం
  • విజయ్ సరసన నలుగురు హీరోయిన్లు

విజయ్ దేవరకొండ మరోసారి లవర్ బాయ్ పాత్రలో నటిస్తున్న చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.  క్రాంతిమాధవ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ హైప్ సంపాదించుకుంది. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన రాశీ ఖన్నా, క్యాథరిన్ ట్రెసా, ఇజబెల్లా, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. ప్రేమంటే త్యాగం కాదు, ప్రేమలో ఓ దైవత్వం ఉంటుంది అంటూ హీరోయిన్ చెప్పే డైలాగుతో మొదలైన టీజర్, చివర్లో ఐ లవ్యూ యామిని అంటూ విజయ్ దేవరకొండ తీవ్ర భావోద్వేగాలతో చెప్పడంతో ముగుస్తుంది. ఇందులో విజయ్ దేవరకొండ లుక్ చూస్తే అర్జున్ రెడ్డి పోకడలు కనిపించకమానవు.

Vijay Devarakonda
World Famous Lover
Tollywood
Teaser
Raashi Khanna
Catherine Tresa
Izabellaleite
Aishwarya Rajesh
Kranthi Madhav
Creative Commercials
  • Error fetching data: Network response was not ok

More Telugu News