Sreemukhi: రష్మీ, జానీ మాస్టర్ లకు గ్రీన్ చాలెంజ్ విసిరిన శ్రీముఖి

  • ముమ్మరంగా సాగుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్
  • రెండు మొక్కలు నాటిన శ్రీముఖి
  • ఎంపీ సంతోష్ కు ధన్యవాదాలంటూ ట్వీట్

తెలంగాణ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ మరింత ముందుకుపోతోంది. సెలబ్రిటీలు ఈ చాలెంజ్ పట్ల విపరీతమైన ఆసక్తి చూపిస్తుండడమే అందుకు కారణం. తాజాగా, గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించిన ప్రముఖ యాంకర్ శ్రీముఖి తనవంతు బాధ్యతగా రెండు మొక్కలు నాటింది. ఆపై రష్మి గౌతమ్, వితికాషేరు, జానీ మాస్టర్ లను గ్రీన్ ఇండియా చాలెంజ్ కు నామినేట్ చేసింది. ఈ మేరకు శ్రీముఖి ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఇదో అద్భుతమైన కార్యక్రమం అని, ఎంపీ సంతోష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని శ్రీముఖి పేర్కొంది.

Sreemukhi
Green India Challenge
Rashmi Gautam
Jani Master
Vithika
  • Error fetching data: Network response was not ok

More Telugu News