Nakkar Anand Babu: వారందరికీ కుల ముద్ర వేస్తున్నారు: నక్కా ఆనంద్ బాబు

  • రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలి
  • విశాఖ రాజధానిగా కావాలని ఎవరూ అడగలేదు
  • భూములిచ్చిన రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అనడానికి సిగ్గుపడాలి

ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. అమరావతి ప్రాంత రైతులు చేసిన త్యాగాలను గౌరవించాలని అన్నారు. విశాఖ రాజధానిగా కావాలని ఎవరూ అడగలేదని... కానీ, అమరావతిని అందరి ఆమోదంతోనే నిర్ణయించారని చెప్పారు. అమరావతిని మార్చాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. అమరావతి ప్రాంత రైతులకు కుల ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అనడానికి సిగ్గుపడాలని అన్నారు.

Nakkar Anand Babu
Telugudesam
Amaravati
  • Loading...

More Telugu News