Smart Phones: ఈ సమస్యను పరిష్కరిస్తే.. రూ.35 లక్షలు మీవే.. ఎన్పీసీఎల్, బిల్ అండ్ మెలిండా గేట్స్ బంపర్ ఆఫర్

  • ఫీచర్ ఫోన్లలో యూపీఐ సౌకర్యాలు కల్పించాలని సవాల్
  • దేశంలో ఫీచర్ ఫోన్లు వినియోగిస్తున్నవారి సంఖ్య 50 కోట్లు 
  • బిల్ అండ్ మెలిండా గేట్స్ పౌండేషన్, సీఐఐఈ.సీవోతో కలిసి ప్రాజెక్టు

దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపులు, లావాదేవీలు పెరిగిపోయాయి. యూపీఐ(యూనిఫైడ్  పేమెంట్స్ ఇంటర్ ఫేస్) ద్వారా జరిగే ఈ లావాదేవీలన్నీ స్మార్ట్ ఫోన్లలోనే జరుగుతున్నాయి. దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరుగుతున్నప్పటికీ.. ఇంకా 50 కోట్ల ఫీచర్ ఫోన్ల వినియోగదారులున్నారని ఎన్పీసీఎల్ అంచనా. ఫీచర్ ఫోన్లలో కూడా యూపీఐ సౌకర్యాన్ని కల్పించేందుకు సాఫ్ట్ వేర్ ను రూపొందించాలని భారత్ లో యూపీఐను నిర్వహించే ఎన్పీసీఎల్(నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సంకల్పించింది. బిల్ అండ్ మెలిండా గేట్స్ పౌండేషన్, సీఐఐ సీవో కలిసి ఎన్పీసీఎల్ ఉమ్మడిగా ఓ ప్రాజెక్టును చేబత్తాయి.

ఈ ప్రాజెక్టులో భాగంగా యూపీఐ సౌకర్యాన్ని ఫీచర్ ఫోన్లలో ఉపయోగించుకునేందుకు వీలుగా సాఫ్ట్ వేర్ ను రూపొందించినవారికి 50 వేల డాలర్ల (రూ.35.85 లక్షలు) బహుమతిని ప్రకటించింది. రెండో బహుమతిగా 30 వేల డాలర్లు(రూ.21.5 లక్షలు), మూడో బహుమతిగా 20 వేల డాలర్లు(రూ.14.34 లక్షలు) నిర్ణయించింది. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందేందుకు దేశంలోని టెక్కీలకు ఇది చక్కని అవకాశమని పేర్కొంది. ఈ పోటీ ఈ నెల 12న ముగియనున్నదని, విజేతలను మార్చి 14న ప్రకటిస్తామని యూపీఐ నిర్వహణ సంస్థ పేర్కొంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News