Telugudesam: విజయసాయిరెడ్డి గారూ, జగన్ పనికిరానివాడని మీరు చాటి చెబుతున్నారేంటి?: బుద్ధా వెంకన్న సెటైర్లు

  • కొత్త స్కామ్ కి ఏమైనా ప్లాన్ చేశారా?
  • అమరావతి పరిధిలో గ్రామాలేవో కూడా మీకు తెలీదు! 
  • ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటే ఎలా?

టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్లు చేయడం.. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందిస్తూ కౌంటర్ ట్వీట్లు చేయడం తెలిసిందే. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డ చంద్రబాబు తన వాళ్ల భూముల విలువ పెంచేందుకు ఎన్నో కోతలు కోశారంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను బుద్ధా ఖండించారు.

అదే సమయంలో, విజయసాయిపై సెటైర్లు వేశారు. ‘పదే పదే ముఖ్యమంత్రి జగన్ పనికిరానివాడు అని మీరు ట్వీట్లు పెట్టి చాటి చెబుతున్నారు ఏంటి? కొత్త స్కామ్ కి ఏమైనా ప్లాన్ చేశారా?’ అని ప్రశ్నించారు. అమరావతి పరిధిలోకి వచ్చే గ్రామాలు ఏవో కూడా తెలియకుండా ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడితే ఎలా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయినా తమపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఏడవలేక అనవసర ఏడుపులు ఎందుకంటూ విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు.

Telugudesam
Budda Venkanna
YSRCP
Vijayasai
  • Loading...

More Telugu News