Smrithi Irani: భర్త వెనుకే భార్య ఎందుకు నడుస్తుంది?... స్మృతి ఇరానీ ఏం చెప్పారో చూడండి!

  • భర్త వెనుక రెండడుగుల దూరంలో భార్య
  • అది దైవ నిర్ణయమని స్మృతి వెల్లడి
  • భర్త దారితప్పినా వెనకుండి సరిదిద్దే వీలుంటుందన్న స్మృతి

భారత సంప్రదాయం ప్రకారం భర్త ముందు నడిస్తే అతడికి కాస్త వెనుకగా భార్య నడుస్తుంది. దీనికి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తనదైన శైలిలో భాష్యం చెప్పారు. మన దేశ సంప్రదాయం ప్రకారం భర్తకు రెండడుగులు వెనుకగా భార్య నడవాలన్నది దైవ నిర్ణయం. అందుకు బలమైన కారణం ఉంది. భర్త దారితప్పినా వెనకున్న భార్య సరిదిద్దే వీలుంటుంది. అతడు సమతౌల్యం కోల్పోయినా అతడ్ని తిరిగి దారిలో పెట్టగల శక్తి స్త్రీకి ఉంటుంది. ఈ కారణంగానే భర్త వెనుకే భార్య ఉంటుంది అంటూ నిర్వచించారు. ప్రస్తుతం స్మృతి వ్యాఖ్యలకు చెందిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Smrithi Irani
BJP
Wife
Husband
  • Loading...

More Telugu News