Mangalagiri: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తన భార్య పేరిట 8 ఎకరాలు కొనలేదా?: టీడీపీ నేత జవహర్

  • వైసీపీ నాయకుల తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుంది
  • ఇడుపులపాయలో అసైన్డ్ భూములను జగన్ దోచుకోలేదా?
  • రాజధానితో సీఎం జగన్ పబ్జీ గేమ్ ఆడుకుంటున్నారు

రాజధాని అమరావతి ప్రాంతంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) భార్య పేరిట భూములు ఉన్నాయని టీడీపీ నేత జవహర్ ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ నేతలపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకుల తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉందని విమర్శించారు. ఆర్కే తన భార్య పేరుతో 8 ఎకరాలు కొనలేదా? ఇడుపులపాయలో అసైన్డ్ భూములను జగన్ దోచుకోలేదా? అని ప్రశ్నించారు. రాజధానితో సీఎం జగన్ పబ్జీ గేమ్ ఆడుకుంటున్నారని ఆయన విమర్శలు చేశారు.

Mangalagiri
Mla
RK
Telugudesam
Jawahar
  • Loading...

More Telugu News