Kambhampati Rammohan Rao: ఒక సామాజికవర్గంపై జగన్ పగబట్టారు: టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు

  • 2006లోనే అమరావతిలో ఎకరం భూమిని కొన్నా
  • నా కుటుంబాన్ని వివాదాల్లోకి లాగుతున్నారు
  • వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాలి

2006లోనే అమరావతిలో తాము ఒక ఎకరం భూమిని కొన్నామని టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు తెలిపారు. దాన్ని పట్టుకుని వైసీపీ నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటున్నారని మండిపడ్డారు. అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏమిటో వారికి తెలుసా? అని ప్రశ్నించారు.

రాజకీయాలతో సంబంధం లేని తమ కుటుంబాన్ని అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ కూడా రాజధానిలో ఇంటిని నిర్మించుకున్నారు కదా? అని ప్రశ్నించారు. ఒక సామాజికవర్గంతో పాటు రాజధాని రైతులపై జగన్ పగబట్టారని విమర్శించారు. ఒక రాజధానికే డబ్బు లేకపోతే... మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు.

Kambhampati Rammohan Rao
Jagan
Amaravati
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News