Chandrababu: చంద్రబాబు భార్య భువనేశ్వరిపై విమర్శలు చేయడం దారుణం: టీడీపీ ఎంపీ కనకమేడల

  • వైసీపీ ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆడుకుంటోంది
  • అవాస్తవాలను వాస్తవాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు
  • పాలన వైఫల్యాలు, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ప్రయత్నం

అమరావతిలో దీక్షలు చేస్తోన్న రైతులకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో కలిసి వెళ్లి ఆయన భార్య భువనేశ్వరి సంఘీభావం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించడం దారుణమని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఢిల్లీలో కనకమేడల మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆడుకుంటోందన్నారు. అవాస్తవాలను పదేపదే చెప్పి వాస్తవాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పాలన వైఫల్యాలు, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆయన ప్రభుత్వం ఏపీ ప్రజలను పక్కదారి పట్టిస్తోందని చెప్పారు. టీడీపీ నేతలెవరూ ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడలేదని చెప్పారు. దొనకొండ వద్ద జరిగిన భూ లావాదేవీలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Chandrababu
YSRCP
Kanakamedala Ravindra Kumar
  • Loading...

More Telugu News