Vijay Devarakonda: విజయ్ దేవరకొండతో జాన్వీ జోడీ కట్టడం లేదట

  • పూరి తాజా ప్రాజెక్టుగా 'ఫైటర్'
  • త్వరలోనే సెట్స్ పైకి విజయ్ దేవరకొండ 
  • డేట్స్ ఖాళీ లేవని చెప్పిన జాన్వీ కపూర్  

విజయ్ దేవరకొండ హీరోగా పూరి 'ఫైటర్' సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాకి కరణ్ జొహార్ నిర్మాణ భాగస్వామిగా వున్నాడు. ఈ సినిమాను వివిధ భాషల్లో విడుదల చేయాలనే ఉద్దేశంతో, కథానాయికగా ఆయన జాన్వీ కపూర్ ను ఎంపిక చేసినట్టుగా వార్తలు వచ్చాయి.

తనకి విజయ్ దేవరకొండ స్టైల్ నచ్చుతుందనీ, ఆయనతో కలిసి సినిమా చేసే ఛాన్స్ వస్తే వదులుకోనని గతంలో ఒక ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ చెప్పింది. అందువలన తెరపై ఈ జోడీ కనువిందు చేయడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఇతర ప్రాజెక్టులతో బిజీగా వున్న కారణంగా తను ఈ సినిమా చేయడం కుదరదని జాన్వీ చెప్పిందనేది బాలీవుడ్ టాక్. ఇది విజయ్ దేవరకొండ అభిమానులకు నిరాశ కలిగించే విషయమే. అయితే ఇందులో వాస్తవమెంతన్నది తెలియాల్సి వుంది.

Vijay Devarakonda
Janhvi Kapoor
  • Loading...

More Telugu News