guntur: మధ్యాహ్న భోజనం వద్ద విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఒకరికి బ్రెయిన్ డెడ్

  • ప్రాణం తీసిన చిన్న తగాదా 
  • గుంటూరు కొత్త పేట ప్రైవేటు కళాశాలలో ఘటన 
  • పోలీసుల అదుపులో నిందితుడు

మధ్యాహ్న భోజనం సందర్భంగా ఇద్దరు విద్యార్థుల మధ్య ప్రారంభమైన చిన్న వాగ్వాదం ఘర్షణకు దారితీసి కొట్టుకునే వరకు వచ్చింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి బ్రెయిన్ డెడ్ అవ్వడం స్థానికంగా సంచలనమైంది. గుంటూరు పట్టణం కొత్త పేటలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కొత్త పేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో నవీన్, మథ్యూస్ అనే విద్యార్థులు ఇంటర్ చదువుతున్నారు. నిన్న మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.

తీవ్రంగా గాయపడిన నవీన్ స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే స్పందించిన తోటి విద్యార్థులు హుటాహుటిన అతనిని ఆసుపత్రికి తరలించారు. అతన్ని పరిశీలించిన వైద్యులు నవీన్ బ్రెయిన్ డెడ్ అయ్యిందని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మాథ్యూస్ ను అదుపులోకి తీసుకున్నారు.

guntur
kothapeta
students fight
one brain dead
  • Loading...

More Telugu News