Penna River: విషాదం నింపిన ఈత సరదా... ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి!

  • సెలవులకు కడపకు వచ్చిన కుటుంబం 
  • పెన్నా నదిలో ఈత కొట్టేందుకు వెళ్లిన చిన్నారులు
  • కాపాడేందుకు ప్రయత్నించిన మేనమామ కూడా మృత్యువాత

కడప జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెన్నా నదిలో ఈత కొట్టాలన్న సరదా ఒకే కుటుంబానికి చెందిన నలుగుర్ని బలి తీసుకుంది. కర్ణాటకలోని రాయచూర్ కు చెందిన ముంతాజ్ తన పిల్లలను సెలవుల్లో కడప తీసుకువచ్చింది. అక్కడ ముంతాజ్ సోదరుడు అన్వర్ నివసిస్తున్నాడు.

ముంతాజ్ పిల్లలు మదియా, పరియా, జోహాన్ లతో కలిసి వారి మేనమామ అన్వర్ సరదాగా సిద్ధవటం వద్ద పెన్నా నది చూసేందుకు వెళ్లారు. అక్కడ నదిలో ఈతకొట్టేందుకు ప్రయత్నించిన మదియా, పరియా మునిగిపోవడంతో వారిని కాపాడేందుకు జోహాన్ ప్రయత్నించింది. జోహాన్ కూడా నీటిలో మునిగిపోవడంతో అన్వర్ నీటిలోకి దూకాడు. కానీ అన్వర్ సైతం నీళ్లలో మునిగిపోయి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

Penna River
Kadapa District
Sidhavatam
Karnataka
Raichur
  • Loading...

More Telugu News