Bonda Uma: రాజధాని మహిళల పరిస్థితి చూసి భువనేశ్వరి చలించిపోయారు: బోండా ఉమ

  • టీడీపీ నేతలపై వైసీపీ ఆరోపణలు
  • వీడియోల సాయంతో విమర్శలు
  • ఘాటుగా స్పందించిన బోండా ఉమ

అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు వీడియోల సాయంతో వివరించడం పట్ల టీడీపీ నేత బోండా ఉమ స్పందించారు. వైసీపీ నేతల్లో కొందరు చంద్రబాబు అర్ధాంగి భువనేశ్వరిపై వ్యాఖ్యలు చేయడాన్ని ఉమ తప్పుబట్టారు. రాజధాని అమరావతిలో మహిళల ఆవేదన చూసి భువనేశ్వరి చలించిపోయారని, అందుకే మద్దతు ఇచ్చారని అన్నారు. కానీ భువనేశ్వరి గురించి కూడా వైసీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

రాజధానిలో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని బలహీనపర్చేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రతిసారి ఓ సామాజిక వర్గం అంటూ ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే కులాల లెక్క తీయాలని సవాల్ విసిరారు. కాగా, రాజధాని రైతుల పరిస్థితి చూసి కదిలిపోయిన నారా భువనేశ్వరి తన చేతి గాజులను విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.

Bonda Uma
Nara Bhuvaneswari
Telugudesam
Andhra Pradesh
Amaravati
YSRCP
  • Loading...

More Telugu News