MAA: 2020 ఆరంభానికి ఇదే బెస్ట్ ఫొటో!: మంచు మనోజ్

  • హైదరాబాదులో మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం
  • చిరంజీవి, మోహన్ బాబు మధ్య వెల్లివిరిసిన ఆత్మీయత
  • ఫొటోలను పంచుకున్న మంచు మనోజ్

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ ట్విట్టర్ లో ఆసక్తి కలిగించే వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో జరిగిన మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీనియర్ నటులు చిరంజీవి, మోహన్ బాబు మధ్య చోటుచేసుకున్న ఆత్మీయ సన్నివేశాన్ని మంచు మనోజ్ ఫొటోల రూపంలో పోస్టు చేశారు.

తాము ఎప్పుడు కలుసుకున్నా ఒకరిపై ఒకరు ఛలోక్తులు విసురుకునేందుకు ప్రాధాన్యత ఇస్తామే తప్ప తామిద్దరి మధ్య విభేదాల్లేవని మోహన్ బాబు వ్యాఖ్యానించగా,దానికి చిరంజీవి ప్రతిస్పందిస్తూ మోహన్ బాబును ఆత్మీయాలింగనం చేసుకుని బుగ్గపై అభిమానంతో ముద్దు పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలనే మంచు మనోజ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. సినీ అమ్మ ముద్దుబిడ్డలు అంటూ పేర్కొన్న మనోజ్, 2020 ఆరంభానికి ఇదే బెస్ట్ ఫొటో అంటూ వ్యాఖ్యానించారు.

MAA
Diary
Hyderabad
Tollywood
Mohanbabu
Chiranjeevi
  • Loading...

More Telugu News