Andhra Pradesh: సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ ను మన సీఎం జగన్ నెరవేర్చారు: విజయసాయిరెడ్డి

  • ఏపీ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం
  • స్పందించిన విజయసాయిరెడ్డి
  • భారం పడినా మాటకు కట్టుబడ్డామని వెల్లడి

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఏపీ ప్రభుత్వం ప్రకటించడమే కాదు, అమల్లోకి కూడా తీసుకువచ్చింది. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ ను మన సీఎం జగన్ నెరవేర్చారని కితాబిచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని జగన్ నిలబెట్టుకున్నారని తెలిపారు. 52 వేలకు పైగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగుతారని విజయసాయి ట్వీట్ చేశారు.

అంతేకాకుండా, ఆర్టీసీ విలీనం అనంతరం కొత్త ప్రజా రవాణా విభాగం ఏర్పడుతుందని వెల్లడించారు. విలీనం నిర్ణయంతో ప్రభుత్వంపై అదనపు భారం పడినా, ఇచ్చిన మాటకు కట్టుబడి నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. తమకు సాధ్యమైనంత మేర ఏపీ ప్రజలకు మేలు చేయడానికే కృషి చేస్తామని వివరించారు.

Andhra Pradesh
RTC
YSRCP
Jagan
Vijay Sai Reddy
  • Loading...

More Telugu News