Serbia: సెర్బియన్ మరదలికి స్వాగతం పలికిన కృనాల్ పాండ్య

  • బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్ తో హార్దిక్ పాండ్య నిశ్చితార్థం
  • దుబాయ్ లో ప్రపోజ్ చేసిన క్రికెటర్
  • ట్విట్టర్ లో స్పందించిన హార్దిక్ సోదరుడు కృనాల్

సెర్బియా జాతీయురాలు, బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్ తో టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య నిశ్చితార్థం జరుపుకోవడం ఇప్పుడు క్రీడావర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు తెలిసినా, హార్దిక్ ఇంత స్పీడుగా వ్యవహరిస్తాడని ఎవరూ ఊహించలేదు. దుబాయ్ లో తన ప్రేయసికి ప్రపోజ్ చేసిన హార్దిక్ ఆమె నుంచి అంగీకారం తీసుకున్నాడు.

ఈ సందర్భంగా హార్దిక్ సోదరుడు, కృనాల్ పాండ్య స్పందించాడు. తన కాబోయే మరదలు నటాషాకు స్వాగతం పలికాడు. "మా క్రేజీ కుటుంబంతో నువ్వు జత కలవడం ఎంతో ఆనందంగా ఉంది. కంగ్రాట్స్ హార్దిక్, నటాషా... మీ ఇద్దర్నీ ప్రేమిస్తున్నాం" అంటూ ట్వీట్ చేశాడు.

Serbia
Natasha Stancovic
Bollywood
Hardik Pandya
Krunal Pandya
Cricket
Teamindia
  • Loading...

More Telugu News